మూడు గ్రామాల్లో రూ.43 లక్షలతో సీసీ రోడ్లు
నూజెల్ల, చిరుచింతల, సేరిదింటకుర్రులో పనులకు శంకుస్థాపన పల్లె పండుగ 3.0 నిధులతో గ్రామీణ రహదారుల అభివృద్ధి నియోజకవర్గవ్యాప్తంగా రూ.9 కోట్లతో రోడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ రూరల్, అక్టోబర్ 10: గుడివాడ రూరల్ మండలంలోని మూడు గ్రామాల్లో రూ.43 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నూజెల్ల గ్రామంలో రూ.7 లక్షలు, చిరుచింతలలో రూ.18 లక్షలు, సేరిదింటకుర్రులో రూ.18 లక్షలతో చేపట్టే రహదారి పనులను ప్రారంభించారు. స్థానిక మహిళలు, ప్రజల భాగస్వామ్యంతో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పల్లె పండుగ 3.0 ద్వారానియోజకవర్గవ్యాప్తంగా


సుమారు రూ.9 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ అధికారి సూరిబాబు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహనరావు, దగ్గుమిల్లి బద్రి, గోరిపర్తి సుబ్బారావు, నిమ్మగడ్డ సత్యసాయి, జనసేన నాయకుడు రేమల్లి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

