అంగరంగ వైభవంగా వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన బర్త్‌డే వేడుకలు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు... అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడిన పశ్చిమ వైఎస్సార్‌సీపీ కార్యాలయం... విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు.. మహిళలకు చీరల పంపిణీ..



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పండుగ వాతావరణంలో నిర్వహించిన వేడుకలకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం సందడిగా మారింది.
పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలతో జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ముఖ్య నాయకుల సమక్షంలో వెలంపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. భారీ గజమాలలతో తమ అభిమానాన్ని చాటుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ అందించడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వెలంపల్లి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని అభిమానులు ఆకాంక్షించారు.
వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్లు బండి పుణ్యశీల, కర్నాటి రాంబాబు, మనోజ్ కొఠారి, గౌస్ మొహిద్దీన్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు, వివిధ కుల, వ్యాపార సంఘాల ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

