లంచానికీ నెలవారీ వాయిదా
అంగన్వాడీ తాత్కాలిక రిపోర్టు తొలగింపునకు రూ 63 వేల డిమాండ్ నెలకు రూ వెయ్యి చొప్పున 21 వాయిదాల్లో వసూలు రూ 21 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీకి చిక్కిన అధికారిణి

జగిత్యాల, సెప్టెంబర్ 26 : లంచం మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో వసూలు చేస్తున్న మహిళా అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు అధికారిణి దారోజు పద్మ రూ 21 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలోని ఓ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి తాత్కాలికంగా నమోదైన ప్రతికూల నివేదికను తొలగించేందుకు ఆమె రూ 63 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెలకు రూ వెయ్యి చొప్పున 21 మంది నిర్వాహకుల నుంచి వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా మూడు నెలలకు సంబంధించిన రూ 63 వేల మొత్తంలో రూ 21 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.

