గంజాయి కేసుల నిందితుడిపై నిర్బంధ చర్యలు
నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు… ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉత్తర్వుల అమలు… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు…

విజయవాడ: గంజాయి అక్రమ రవాణాతో పాటు పలు వివాదాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రసాదంపాడుకు చెందిన తుమ్మల విశ్వేశ్వరరావు అలియాస్ కుక్కలోడుపై పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు అమలు చేసినట్లు పటమట సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. నిందితుడి నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిర్బంధ ఉత్తర్వులను అమలు చేసి అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

