గంజాయి ఆనవాళ్లు చెబితే బహుమతి
గవర్నర్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో ‘ఈగల్ చాలెంజ్’ ప్రచారం ఆటో రిక్షాపై మైక్‌తో ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన సమాచారం కోసం 1972తోపాటు ప్రత్యేక ఫోన్ నంబర్లు

విజయవాడ, ఆగస్టు 31: విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ‘ఈగల్ చాలెంజ్’పై విస్తృత ప్రచారం నిర్వహించారు. గవర్నర్‌పేట సీఐ బి. బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆటో రిక్షాపై మైక్ ఏర్పాటు చేసి, పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు. గంజాయి విక్రయం, రవాణా, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన బహుమతి అందజేస్తామని ప్రకటించారు. గంజాయి మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ బాలమురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించాల్సిన నంబర్లు: టోల్‌ఫ్రీ: 1972 ఫోన్: 0866–2576023 మొబైల్: 9440627079
