ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ25, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఫుడ్ కంపెనీలపై FSSAI కొరడా

తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్స్‌, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు... నెస్లే ఇండియా, పెప్సీకో, కోకాకోలా సహా పలు ప్రముఖ సంస్థలపై నియంత్రణ సంస్థ చర్యలు... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు 12 నోటీసులు.. ఒక అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్ రద్దు...

V10TV న్యూస్ డెస్క్ 25 ఆగస్టు, 2026 4:41 PMకి 2,369 వీక్షణలు
ఫుడ్ కంపెనీలపై FSSAI కొరడా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఆహార ఉత్పత్తుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొరడా ఝళిపించింది. ఇటీవలి నెలల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్స్‌, లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి అంశాలకు సంబంధించి ఆహార, పానీయ సంస్థలకు 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది.

చర్యలు ఎదుర్కొన్న సంస్థల జాబితాలో నెస్లే ఇండియా, పెప్సీకో, కోకాకోలా ఇండియా, అబాట్ ఇండియా, రెడ్‌బుల్ ఇండియా, డానోన్ ఇండియా, మాన్‌స్టర్ ఎనర్జీ, మోండెలెజ్ ఇండియా, ఫెరెరో ఇండియా తదితర ప్రముఖ కంపెనీలు ఉన్నట్లు FSSAI వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని ఉత్పత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

ఈ-కామర్స్ రంగంపైనా FSSAI దృష్టి సారించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించి మొత్తం 12 నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఒక అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు వెల్లడించింది.

అంతేకాకుండా KFC, మెక్‌డొనాల్డ్స్, పిజ్జా హట్, డొమినోస్, కోస్టా కాఫీ వంటి ఫుడ్ సర్వీస్ సంస్థలకు 30కి పైగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. డొమినోస్‌కు సంబంధించిన ఐదు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు FSSAI తెలిపింది. నోటీసులు అందుకున్న పలు సంస్థలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు కూడా పేర్కొంది.

వినియోగదారులకు ఆహార ఉత్పత్తులపై సరైన సమాచారం అందేలా చూడటం, ఆహార భద్రతా ప్రమాణాలు, ప్రకటనలు, లేబులింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయించడమే ఈ చర్యల ఉద్దేశంగా FSSAI పేర్కొంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘అఖండ గోదావరి’గా పుష్కరాలకు మహా ప్రణాళిక

16 నిమిషాల క్రితం 1

స్థానిక పోరుకు వైసీపీని సిద్ధం చేస్తున్న జగన్

24 నిమిషాల క్రితం 1,689

ఆధ్యాత్మిక శోభతో అంకాలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం

47 నిమిషాల క్రితం 1,546

గర్భిణీల గుండె ఆరోగ్యానికి ‘సుజనా’ భరోసా

56 నిమిషాల క్రితం 2,457