సీఐ అలీ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి
విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

విజయవాడ, సెప్టెంబర్ 28: నున్న పోలీస్‌స్టేషన్ సీఐ అహ్మద్ అలీ ఆకస్మిక మృతిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై ఆయన మరణించడం బాధాకరమని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అహ్మద్ అలీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

