వర్షాల వేళ అప్రమత్తతే రక్షణ
లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచిన రహదారుల్లో జాగ్రత్తగా ప్రయాణించాలి పొంగిపొర్లుతున్న డ్రైనేజీలకు దూరంగా ఉండాలి విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లొద్దు: వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు

విజయవాడ, సెప్టెంబర్ 23 : నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు సూచించారు. ముఖ్యంగా వన్‌టౌన్‌తోపాటు లోతట్టు ప్రాంతాల్లోని రహదారులపై వర్షపు నీరు నిలిచే అవకాశం ఉందని తెలిపారు. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు రహదారులపై ప్రవహించే ప్రమాదం ఉందని, నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపడిన తీగల సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఏసీపీ దుర్గారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

