వైసీపీని వీడి టీడీపీలో చేరిన బండారు ఆంజనేయులు
27వ డివిజన్ బావాజీపేట నుంచి అనుచరులతో కలిసి చేరిక బండారు ఆంజనేయులుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బొండా ఉమా స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం బీఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో 27వ డివిజన్ బావాజీపేటకు చెందిన వైసీపీ నాయకుడు బండారు ఆంజనేయులు తన అనుచరులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి బొండా ఉమా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ మరింత

బలోపేతమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంఅమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరమాచనేని కిషోర్, దాసరి జయరాజు, గుడివాడ దీపక్, మంటాడ శివ, సీహెచ్ రఘు, డీవీఆర్, సీహెచ్ మధు తదితరులు పాల్గొన్నారు.

