బొండా సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు ప్రశంస
భుజం తట్టి ‘బాగా చేశావు’ అంటూ అభినందన... పట్టాభిషేకం సభ విజయవంతంలో సిద్ధార్థ్ కృషికి గుర్తింపు... ముఖ్యమంత్రి ప్రశంసలతో తెదేపా శ్రేణులు, యువతలో ఉత్సాహం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబరు 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ యువ నాయకుడు బొండా సిద్ధార్థ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సిద్ధార్థ్ చేసిన కృషిని సీఎం ప్రశంసించారు. కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం, భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంలో బొండా సిద్ధార్థ్ కీలకంగా పనిచేశారని

పార్టీ నాయకులు తెలిపారు. సభ నిర్వహణతోపాటు ప్రజలను సమీకరించడంలో ఆయన చూపిన చొరవ ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించిందన్నారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ్ భుజం తట్టిన చంద్రబాబు ‘బాగా చేశావు’ అంటూ అభినందించారు. ముఖ్యమంత్రి నుంచి లభించిన ప్రశంస యువ నాయకత్వానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ పరిణామంతో సెంట్రల్ నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు, యువతలో నూతన ఉత్సాహం నెలకొంది.

