సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు
హెచ్‌బీ కాలనీ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక శిబిరం... 16 మందికి గుండె సంబంధిత ప్రమాద నిర్ధారణ పరీక్షలు... గర్భధారణ సమయంలో వచ్చే గుండె సమస్యలను ముందుగానే గుర్తించడమే లక్ష్యం...

విజయవాడ, సెప్టెంబర్ 29: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ గర్భిణుల కోసం నిర్వహిస్తున్న ఉచిత సంచార ద్విమితీయ గుండె పరీక్ష శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. మంగళవారం హెచ్‌బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక గర్భిణులు సద్వినియోగం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన శిబిరంలో 16 మంది గర్భిణులకు గుండె సంబంధిత ప్రమాదాలను గుర్తించే ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో మహిళల్లో తలెత్తే గుండె సమస్యలను ముందుగానే గుర్తించి, ప్రాణాంతక పరిస్థితులను నివారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ పనిచేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిబిరంలో వైద్యుడు ఎన్.వంశీ, సాంకేతిక నిపుణులు సుప్రియ, సింధుప్రియ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర సమన్వయకర్తలు సేవలందించారు.

