ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి ఇద్దరు నేతలు!

మాజీ దేవాలయ చైర్మన్‌ కొల్లూరు రామకృష్ణ టీడీపీలో చేరిక… అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్న యువజన నేత కురిటి శివ… బొండా ఉమా సమక్షంలో హనుమాన్‌పేట వేదికగా చేరికలు…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 9:57 AMకి 3,270 వీక్షణలు
వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి ఇద్దరు నేతలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ కాశీ విశ్వేశ్వర దేవాలయ చైర్మన్‌ కొల్లూరు రామకృష్ణ, వైసీపీ యువజన విభాగ నాయకుడు కురిటి శివ తమ అనుచరులతో కలిసి ఆదివారం సాయంత్రం హనుమాన్‌పేటలోని అనుముల లక్ష్మణరావు కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు నాయకులు టీడీపీలో చేరుతున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086