ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ11, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

స్వచ్ఛతలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్!

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి ఆరు జాతీయ పురస్కారాలు… విజయవాడ సహా ఐదు నగరపాలక సంస్థలకు, కుప్పం మున్సిపాలిటీకి గుర్తింపు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ…

V10TV న్యూస్ డెస్క్ 11 నవంబర్, 2026 6:10 PMకి 6,759 వీక్షణలు
స్వచ్ఛతలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

న్యూఢిల్లీ, నవంబర్ 11 : స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో రాష్ట్రానికి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు జాతీయ పురస్కారాలు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర ప్రతినిధులు పురస్కారాలను అందుకున్నట్లు అందిన సమాచారం. రాష్ట్రం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థలు సూపర్ స్వచ్ఛ లీగ్ విభాగంలో పురస్కారాలకు ఎంపికయ్యాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్, గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థకు సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ విభాగాల్లో గుర్తింపు లభించింది. అదేవిధంగా 20 వేలలోపు జనాభా కలిగిన పట్టణాల విభాగంలో కుప్పం మున్సిపాలిటీ స్వచ్ఛ సిటీ పురస్కారాన్ని దక్కించుకుంది. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పరిశుభ్రత ప్రమాణాల మెరుగుదలకు చేపట్టిన చర్యలకు ఈ జాతీయ పురస్కారాలు గుర్తింపుగా నిలిచాయి. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతోపాటు పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతర చర్యలు అవసరమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ వైభవం

5 నిమిషాల క్రితం 0

84లో.. 86వ డివిజన్ టీడీపీ కార్యాలయం!

49 నిమిషాల క్రితం 9,808

మహిళ వైద్యానికి రూ.3.90 లక్షల చేయూత

56 నిమిషాల క్రితం 1

బాధితురాలి వైద్యానికి రూ.7.16 లక్షల సాయం

1 గంట క్రితం 8,706