భార్యను హత్య చేసి.. కాళీమాత ఆలయంలో భర్త కలకలం!
కుటుంబ కలహాలతో దారుణానికి ఒడిగట్టిన భర్త… భార్య తలతో ఆలయ ప్రాంగణంలో కూర్చున్న నిందితుడు… స్థానికుల సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు…

గంగారాంపూర్, నవంబర్ 9: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె తలను నరికి స్థానిక కాళీమాత ఆలయ ప్రాంగణంలో కూర్చోవడం తీవ్ర కలకలం రేపింది. అందిన సమాచారం ప్రకారం, గంగారాంపూర్కు చెందిన రింటూ ఘోష్ (46)కు సీమా సర్కార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రింటూ గతంలో బస్సు కండక్టర్‌గా పనిచేసేవాడు. కొంతకాలం క్రితం ఉద్యోగం మానేయడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరోసారి దంపతుల మధ్య వివాదం తలెత్తగా, రింటూ ఘోష్ తన భార్యను హత్య చేసి తల నరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె తలను తీసుకుని స్థానిక కాళీమాత ఆలయ ప్రాంగణానికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రింటూ ఘోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

