ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో అడుగు

పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని పెంచాలి… గూడవల్లిలో స్వచ్ఛ ఆంధ్ర పాలకవర్గం శ్రమదానం… వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 4:38 PMకి 2,587 వీక్షణలు
స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో అడుగు — చిత్రం 1
స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో అడుగు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో గురువారం నిర్వహించిన ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమంలో కార్పొరేషన్‌ డైరెక్టర్లు, కార్యనిర్వాహక సంచాలకులతో కలిసి ఆయన శ్రమదానం చేశారు. ‘అందరం కలిసి ఒక రోజు–ఒక గంట’ నినాదంతో రోడ్లను శుభ్రం చేసి, కొడవళ్లతో తుప్పలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. వర్మీ కంపోస్టు తయారీ, వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన గోడ చిత్రాలు, స్వచ్ఛ రథం, యంత్రాలతో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మట్టి గ్లాసులు, చెక్క చెంచాలు, కాగితపు గ్లాసులు తదితర పర్యావరణహిత వస్తువులతో

స్వచ్ఛ ఆంధ్ర కోసం మరో అడుగు — అదనపు చిత్రం 2

ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి పారితోషికాలు అందజేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యర్థాల విభజనను ప్రోత్సహించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కళాశాల విద్యార్థులకు నాలుగు రకాల వ్యర్థాల విభజనపై అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పట్టాభిరామ్‌ కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు, జిల్లా పరిషత్‌, పంచాయతీరాజ్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086