ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం

రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ… భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 4:22 PMకి 3,901 వీక్షణలు
సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 12: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై మీడియాతో మాట్లాడిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దేవస్థానం, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. శరన్నవరాత్రుల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశమున్నందున క్యూలైన్ల నిర్వహణ, భద్రత, రాకపోకల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ సులభంగా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా దర్శన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. వీఐపీల రాకపోకలతో సామాన్య భక్తుల దర్శనానికి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని రామచంద్ర మోహన్ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086