ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల చెక్కులు అందజేత… సెంట్రల్‌లో ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల సాయం: బొండా ఉమా… అధికారం అంటే ప్రజల పట్ల జవాబుదారీతనమని వ్యాఖ్య…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 3:13 PMకి 3,480 వీక్షణలు
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి — చిత్రం 1
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 7: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం 63వ డివిజన్‌ రాజీవ్‌నగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సమీప మైదానంలో ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు రూ.9 కోట్ల విలువైన వైద్య చికిత్స అనుమతి పత్రాలు, చెక్కులను అందజేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి — అదనపు చిత్రం 2

తర్వాత ఈ నిధి ద్వారా పేదలకు వైద్య సహాయం అందుతోందన్నారు. సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించే ప్రజల అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయం మంజూరయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మంజూరైన చెక్కులను డివిజన్‌ స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ‘‘అధికారం మాకు అలంకారం కాదు.. ప్రజల పట్ల జవాబుదారీతనం. ప్రజలకు సేవ చేయడం మా బాధ్యత’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో లబ్బా వైకుంఠరావు, లబ్బా దుర్గ, మోతుకూరి కాసిం, కోలా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్‌ పైడి తులసి, పెద్ది శ్రీను, మోదుగుల గణేష్‌, చిగుళ్ల నాగమణి, బైరి శీను, బత్తుల కొండ, షేక్‌ మెహర్‌, బాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086