ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బసవతారకం సేవలను స్మరించుకుంటూ రక్తదానం

గుడివాడలో ఘనంగా 42వ వర్ధంతి కార్యక్రమాలు… ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, వెనిగండ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 215 మంది రక్తదానం… మహాతల్లి రుణం తీర్చుకోలేమంటూ కన్నీటి పర్యంతమైన నందమూరి రామకృష్ణ…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 3:43 PMకి 3,860 వీక్షణలు
బసవతారకం సేవలను స్మరించుకుంటూ రక్తదానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబరు 1: స్వర్గీయ నందమూరి బసవతారకం 42వ వర్ధంతి కార్యక్రమాలను గుడివాడలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐఎంఏ హాలులో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, వెనిగండ్ల ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి బసవతారకం కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో విద్యార్థులు, మహిళలు, కూటమి శ్రేణులు కలిపి 215 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తొలుత ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు నందమూరి రామకృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాతలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున ప్రశంసాపత్రాలు అందజేశారు. సురక్ష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళలకు 100 కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. వేదికపైనే భావోద్వేగం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ బసవతారకం ప్రేమ, ఓర్పు, సహనానికి ప్రతిరూపమని కొనియాడారు. ఎన్టీఆర్‌ సినిమా రంగంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో మద్రాసులో 25 మందితో కూడిన ఉమ్మడి కుటుంబాన్ని ఆమె ఎంతో సమర్థంగా నడిపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితంలోని ప్రతి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌ ఎదుర్కొన్న రాజకీయ సవాళ్ల వరకు బసవతారకం ఆయనకు ధైర్యం చెప్పారని తెలిపారు. మహాతల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేమని, మరో జన్మ ఉంటే ఆమెకు సేవకుడిగా పుట్టాలని కోరుకుంటున్నానని చెబుతూ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. భువనేశ్వరి నేతృత్వంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్‌ బ్యాంక్‌ అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఎన్టీఆర్‌ అంటే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ అంటే ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ అంటే గుడివాడ అనేంతగా ఈ ప్రాంతంతో ఆయనకు అనుబంధం ఉందన్నారు. ఎన్టీఆర్‌ ఉన్నతస్థాయికి ఎదగడంలో బసవతారకం సహకారం, త్యాగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ తర్వాతి తరాలు కూడా గుడివాడకు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే మాటకు బసవతారకం జీవితం నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రజలకు అమ్మలాంటి సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. అమరావతిలో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఏపీ ఎస్‌డబ్ల్యూసీ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు విరంకి గురుమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎంఎస్‌ బేగ్‌, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, విద్యార్థులు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వైద్య బృందం పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086