ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

స్థానిక ఎన్నికలకు పోలీసుల సన్నద్ధత

నోటిఫికేషన్‌కు ముందే సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలి… సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి… ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలి: డీజీపీ…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 9:35 AMకి 2,140 వీక్షణలు
స్థానిక ఎన్నికలకు పోలీసుల సన్నద్ధత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుంటూరు, అక్టోబరు 6: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందుగానే సమగ్ర సన్నాహాలు పూర్తి చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మంగళవారం గుంటూరు పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రాంతీయ సమాయత్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున అవసరమైన ముందస్తు పనులను పూర్తి చేసుకోవాలని డీజీపీ సూచించారు. రాజ్యాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాలను గుర్తించి, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితులకు తగినట్లు బందోబస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలను డీఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా పరిశీలించాలని సూచించారు. రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, చట్టప్రకారం ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి భద్రతా లోపాలను ముందుగానే పరిష్కరించాలని డీజీపీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్‌ బృందాలతో నిరంతర గస్తీ నిర్వహించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బలగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల రవాణా, భద్రపరిచే గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతల ఐజీపీ మధుసూదన్‌రెడ్డి ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీలకు సూచనలు చేశారు. గుంటూరు ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ ఘర్షణలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో విస్తృత తనిఖీలతో అక్రమ ఆయుధాలను గుర్తించాలని, ఎన్నికల ప్రతి దశలో రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం కొనసాగించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సమావేశంలో సూచించారు. వదంతులు వెలువడిన వెంటనే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, ఓటర్లు భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ జిల్లాలో పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లను డీజీపీకి వివరించారు. సమావేశంలో గుంటూరు రేంజ్‌ డీఐజీ ఫకీరప్ప, సంబంధిత జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086