విజయవాడ పశ్చిమ ఏసీపీగా విభూ కృష్ణ
బాధ్యతలు స్వీకరించిన 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి… గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్, ప్రొద్దుటూరు ఏఎస్పీగా సేవలు… శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యమని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 15: విజయవాడ పశ్చిమ ఏసీపీగా విభూ కృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విభూ కృష్ణ గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా, ప్రొద్దుటూరు ఏఎస్పీగా విధులు నిర్వహించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.

