ఖాకీల సాక్షిగా బాపూజీకి ఘన నివాళి
జాతిపిత చిత్రపటానికి నివాళులర్పించిన సీఐ చంద్రశేఖర్… సత్యం, అహింసతో స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన మహనీయుడు… గాంధీజీ ఆశయాలు ప్రపంచానికే ఆదర్శమని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 2: సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని అజిత్‌సింగ్‌నగర్ సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీజీ ప్రతిపాదించిన సూత్రాలు, బోధనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఐ కొనియాడారు. బ్రిటిష్ పాలకుల నిర్బంధాలను ఎదుర్కొంటూనే దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

