ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి

బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం విజయవాడ అభివృద్ధికి యువ నాయకత్వం అవసరమని వెల్లడి తీర్మానాన్ని సానుకూలంగా పరిశీలించాలని టీడీపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 12:24 PMకి 1,915 వీక్షణలు
బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి — చిత్రం 1
బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 23: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థకు విజయవాడ మేయర్‌గా అవకాశం కల్పించాలని బ్రాహ్మణ సంఘాల నాయకులు కోరారు. సత్యనారాయణపురంలోని 33వ డివిజన్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు యువ నాయకత్వం అవసరమని సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆధునిక ఆలోచనలు, అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథం, ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేసే నాయకత్వం నగరానికి అవసరమన్నారు. బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పిస్తే నగర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం ద్వారా కొత్త ఆలోచనలు, విధానాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. బొండా సిద్ధార్థ యువత సమస్యలను తెలుసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన ప్రజాసేవ, యువతతో ఉన్న అనుబంధం, ప్రజా సమస్యలపై స్పందించే తీరు, నగరాభివృద్ధిపై చూపుతున్న ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నగరంలోని పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ,

బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి — అదనపు చిత్రం 2

ట్రాఫిక్‌, సుందరీకరణ, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పించి విజయవాడను పరిశుభ్రమైన, సుందరమైన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని టీడీపీ అధిష్ఠానం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ అభివృద్ధి, యువతకు ప్రాధాన్యం, ప్రజాసేవకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘాల తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 33వ డివిజన్‌ టీడీపీ ఇన్‌ఛార్జి గార్లపాటి విజయకుమార్‌, కౌండిన్య సనాతన సమితి అధ్యక్షుడు వీరుబొట్ల అరుణ్‌కుమార్‌, వేద చారిటబుల్‌ సేవా ట్రస్టు అధ్యక్షుడు యడ్లపాటి శేషసాయి, పరశురామ గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉప్పులూరి శేషప్రసాద్‌ శర్మ, కార్యదర్శి మద్దిరాల మురళీమనోహర్‌ శర్మ, సభ్యుడు పోతురాజు జనార్దనరావు, బ్రాహ్మణ నాయకులు జోశ్యుల హనుమయ్య సోమయాజి, గండికోట సుబ్రహ్మణ్యశర్మ, తూములూరి శంకరసాయి, వల్లూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086