ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఏలూరు రోడ్డుపై వర్షపు నీటికి అడ్డుకట్ట:ఎమ్మెల్యే గద్దె

రూ.7 కోట్లతో నీటి పారుదల మెరుగుదలకు చర్యలు… కాలువలకు లైనింగ్‌, అవసరమైన చోట్ల కల్వర్టుల నిర్మాణం… మాచవరం డౌన్‌లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 5:10 PMకి 2,478 వీక్షణలు
ఏలూరు రోడ్డుపై వర్షపు నీటికి అడ్డుకట్ట:ఎమ్మెల్యే గద్దె — చిత్రం 1
ఏలూరు రోడ్డుపై వర్షపు నీటికి అడ్డుకట్ట:ఎమ్మెల్యే గద్దె — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: వర్షం కురిసినప్పుడు ఏలూరు రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు సుమారు రూ.7 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు. మంగళవారం రెండో డివిజన్‌ మాచవరం డౌన్‌లో ఆర్‌.ఆర్‌. చికెన్‌ సెంటర్‌ సమీపంలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ, చుట్టగుంటగా పిలిచే మాచవరం డౌన్‌లో వర్షపు నీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కేంద్రం నుంచి మంజూరైన రూ.7 కోట్లతో కాలువలకు లైనింగ్‌, నీరు సక్రమంగా ప్రవహించేలా మట్టాల సర్దుబాటు పనులు చేపడతామని చెప్పారు. కొండ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు కాలువల్లోకి చేరేలా ఏర్పాట్లు చేస్తామని, అవసరమైన చోట్ల కల్వర్టులు నిర్మిస్తామని వివరించారు. గతంలో

ఏలూరు రోడ్డుపై వర్షపు నీటికి అడ్డుకట్ట:ఎమ్మెల్యే గద్దె — అదనపు చిత్రం 2

2014–19 ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అందించిన నిధులు, ఎల్‌అండ్‌టీ సహకారంతో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల సమీపంలో పెద్ద కల్వర్టు నిర్మించామని గుర్తుచేశారు. దాంతో అక్కడ నీరు నిలిచే సమస్య పరిష్కారమైందని తెలిపారు. స్థానిక నాయకుడు దాసరి గాబ్రియేల్‌ మాట్లాడుతూ, మాచవరం డౌన్‌లో దీర్ఘకాలంగా ఉన్న వర్షపు నీటి నిల్వ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించి పనులు చేపట్టారని చెప్పారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనూ నీటి పారుదల సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సుగసాని రత్న శ్రీకృష్ణప్రసాద్‌, ముత్యాల కృష్ణ, గద్దె రమేష్‌, దోమకొండ రవి, మండవ గణేష్‌, సత్తిబాబు, తాడి బాబురావు, అనిల్‌, అనుముల పూర్ణచంద్రరావు, దుర్గాప్రసాద్‌, షేక్‌ షకీల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు సత్యకుమారి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086