రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు వస్తాయా?
పాలిమర్ నోట్ల తయారీకి కేంద్రం ఆమోదం ఇచ్చిందంటూ ప్రచారం... 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు... ప్రస్తుత నోట్లను ఉపసంహరించనున్నారన్న సమాచారంపై అధికారిక స్పష్టత అవసరం...

న్యూఢిల్లీ: దేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్లను పాలిమర్ లేదా ప్లాస్టిక్ రూపంలో తీసుకురానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్లాస్టిక్ నోట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 2027 ఏప్రిల్ నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉండటం, నీటితో తడిసినా త్వరగా పాడవకుండా ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.10, రూ.20 నోట్లను వెంటనే ఉపసంహరిస్తారనే ప్రచారంపైనా స్పష్టత లేదు.

