మాలల హక్కుల కోసం మహా పోరు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం మాల అమరవీరుల సంస్మరణ సభలో నన్నేటి పుష్పరాజ్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ స్పష్టం చేశారు. ‘మాలల పంతం.. చంద్రబాబు అంతం’ అంటూ ఆయన నినదించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు. తొలుత చెన్నయ్యతో కలిసి మాల అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వెనక్కి తగ్గకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

