ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శాప్‌ ఘటనకు జగన్‌ సూత్రధారి: బుద్దా వెంకన్న

ఉపాధ్యాయులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణ జగన్‌ను కేసులో చేర్చి అరెస్టు చేయాలని డిమాండ్‌ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడి

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 4:31 PMకి 3,582 వీక్షణలు
శాప్‌ ఘటనకు జగన్‌ సూత్రధారి: బుద్దా వెంకన్న — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 23 : శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే సూత్రధారి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్‌ను కుట్రదారుడిగా కేసులో చేర్చి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తాను డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవినేని అవినాష్‌, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు తదితర మాజీ ప్రజాప్రతినిధుల నేతృత్వంలో శాప్‌ కార్యాలయం వద్ద అరాచకం సృష్టించారని ఆరోపించారు. పోలీసులు గేట్లు మూసి తాళాలు వేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారేదన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై దాడికి ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న వారిలో 51 మంది శాప్‌ కార్యాలయం వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి బందరు రోడ్డులో మూడు గంటలపాటు ప్రజలను భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. బాధ్యులను పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలు నిర్వహించేందుకు విజయవాడలో ధర్నాచౌక్‌ ఉందని, గతంలో తాము కూడా అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నిరసన పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాన్ని సమర్థించలేమన్నారు. శాప్‌ ఘటనలో జగన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086