పేద విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్: ప్రధాని మోదీ
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర... దేశానికి యువతే అతిపెద్ద శక్తి.. వారికే తొలి ప్రాధాన్యత... విద్యావకాశాలను మరింత విస్తరిస్తామని ప్రధాని వెల్లడి...

ఆగస్టు 17, V10TV: వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతే దేశానికి అతిపెద్ద శక్తి అని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీ పరీక్షల శిక్షణకు దూరం కాకుండా ఆన్లైన్ ద్వారా ఉచిత కోచింగ్ అందించేలా చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
దేశంలో వైద్య విద్య అవకాశాలను గణనీయంగా పెంచామని, ఉన్నత విద్యా వ్యవస్థను విస్తరించేందుకు పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ప్రధాని పేర్కొన్నారు.

