బెజవాడ లాడ్జిలో తమిళనాడు వ్యక్తి హత్య
పూర్ణానందపేటలోని ఓ లాడ్జిలో ఘటన తమిళనాడుకు చెందిన నరేష్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సత్యనారాయణపురం పోలీసులు

విజయవాడ క్రైమ్ ఆగస్టు 17 (ఆంధ్రప్రభ): విజయవాడలోని పూర్ణానందపేటలో ఓ లాడ్జిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతుడిని తమిళనాడుకు చెందిన నరేష్‌గా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో నరేష్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం అందింది. ఘటనపై సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరు, నరేష్ విజయవాడకు ఎందుకు వచ్చారు, లాడ్జిలో ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

