అజిత్‌సింగ్‌నగర్ నుంచి అంతరిక్షం వైపు
విద్యార్థులను ఆకట్టుకున్న ఇస్రో అంతరిక్ష ప్రదర్శన రాకెట్లు ఉపగ్రహాల నమూనాలతో విజ్ఞాన సందడి భవిష్యత్ శాస్త్రవేత్తలకు స్ఫూర్తి కలిగించడమే లక్ష్యమన్న బొండా ఉమా


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 26 : అజిత్‌సింగ్‌నగర్‌లో అంతరిక్ష విజ్ఞానం సందడి చేసింది. మాకినేని బసవపున్నయ్య నగరపాలక సంస్థ స్టేడియంలో ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విద్యార్థులతో కలిసి సందర్శించారు. చిన్న రాకెట్ల నుంచి భారీ సామర్థ్యం కలిగిన ప్రయోగ వాహక నౌకల వరకు భారతదేశం సాధించిన సాంకేతిక ప్రగతిని నమూనాలు, ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఉపగ్రహ సమాచార వ్యవస్థలతో కమ్యూనికేషన్, విద్య, వాతావరణ సూచనలు, వ్యవసాయం తదితర రంగాల్లో వచ్చిన మార్పులను ఇస్రో అధికారులు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రాకెట్, ఉపగ్రహ

నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసిన నమూనాలు, ప్రయోగాల ద్వారా క్లిష్టమైన అంతరిక్ష అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని బొండా ఉమా పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అధికారి మూర అనిల్, తెలుగు యువత సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు బెజ్జం జైపాల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేల్పుల రాజేష్, డివిజన్ బాధ్యుడు పెరియా సోమేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు, మాజీ కార్పొరేటర్ పాయి తులసి తదితరులు పాల్గొన్నారు.

