సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రిపై రేపు కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి… భద్రత, దర్శన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష… దేవస్థానం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమావేశం…

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16న ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పర్యటనకు అవసరమైన ఏర్పాట్లపై గురువారం దేవస్థానం సమావేశ మందిరంలో అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ఆలయంలో దర్శన నిర్వహణ, అధికారుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్, డీసీపీ కేజీవీ సరిత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

