ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం

సామాన్య భక్తుల కోసం అంతరాలయ దర్శనాలు నిలిపివేత క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో శీనా నాయక్ లిఫ్టుల వద్ద ప్రత్యేక సిబ్బందితో రాకపోకల క్రమబద్ధీకరణ

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 7:34 PMకి 3,634 వీక్షణలు
ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం — చిత్రం 1
ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 27: ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి మధ్యాహ్నం వరకు లఘు దర్శనాలను కొనసాగించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి

ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం — అదనపు చిత్రం 2

క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు వినియోగించే లిఫ్టుల వద్ద రద్దీ పెరగడంతో తోపులాటలకు తావులేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఆదివారం సందర్భంగా ఆలయంలో సంప్రదాయబద్ధంగా సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఆర్జిత సేవల ప్రాంగణాల్లోనూ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలోని భక్తులకు నిరంతరం చల్లని మంచినీరు అందించారు. నూతన అన్నదాన భవనంలో వేడివేడి అన్నప్రసాదంతోపాటు దర్శనం అనంతరం ఉచిత ప్రసాదాన్ని నిరాటంకంగా పంపిణీ

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086