గాంధీజీ ఆశయాలు సదా ఆదర్శప్రాయం
తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి… మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు… సత్యం, అహింసా మార్గంలో పయనించాలని నాయకుల పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 2: పటమట అశోక్‌నగర్‌లోని రఘు గార్డెన్స్‌లో ఉన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ కరీమ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని గుర్తుచేశారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో ఆచరించాలని కోరారు. దేశాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణకు మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నూతి శ్రీను, మేదరమెట్ల నారాయణ, కోడె సాంబశివరావు, పఠాన్ బాజీ, కోగంటి రాంబాబు, మోటూరు బుజ్జిబాబు, వీరమాచినేని రంగారావు, శివాజీ, మాదిరెడ్డి రవి, వెంకట్రావు, కొత్తపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

