పేదలకు పట్టాభిషేకం.. సొంతింటి కల సాకారం!
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర... విజయవాడ సెంట్రల్‌లో ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు... ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ...

విజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడలో పేదల నాలుగు దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసే చారిత్రాత్మక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పేదలకు క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఆరు వేల మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు అందనున్నాయి. ఏళ్ల తరబడి నివాస హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు పట్టాల పంపిణీతో భరోసా లభించనుంది. ఈ కార్యక్రమాన్ని పేదల పండుగగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోపాటు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

