ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఏపీలో మరో నాలుగు పోలీస్‌ కమిషనరేట్లు

రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా ఏర్పాటు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయానికి ఆమోదం.. అమరావతి మౌలిక వసతులు, అసెంబ్లీ పనులకు భారీగా నిధులు..

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 5:36 PMకి 2,263 వీక్షణలు
ఏపీలో మరో నాలుగు పోలీస్‌ కమిషనరేట్లు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబర్‌ 23 : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నాలుగు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నూతన పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయడంతోపాటు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు మంత్రివర్గం అనుమతించింది. అమరావతి మౌలిక వసతుల పనులకు అదనంగా రూ.644.98 కోట్లు, అసెంబ్లీ భవనం స్పైర్‌, రూఫ్‌, లిఫ్టుల నిర్మాణ పనులకు రూ.661 కోట్లు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనలను సవరించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086