ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా

21 కుటుంబాలకు రూ 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి 64వ డివిజన్‌లో 12 మందికి 30వ డివిజన్‌లో 9 మందికి చెక్కులు పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న బొండా ఉమా

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 6:58 PMకి 4,122 వీక్షణలు
ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా — చిత్రం 1
ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్‌కు చెందిన 12 మంది, 30వ డివిజన్‌కు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం రూ 10,00,417 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ వైద్య చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా — అదనపు చిత్రం 2

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదల సంక్షేమం, ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని చెప్పారు. వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, లక్కం రాజు శ్రీనివాసరాజు, కర్ణం రమణ, భద్రం, వెలంపూడి శ్రీను, రెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086