అజిత్‌సింగ్‌నగర్‌లో రేపటి నుంచి క్రీస్తు స్తుతి సువార్త సభలు
రెండు రోజులపాటు 14వ క్రీస్తు స్తుతి సువార్త సభలు… ఆధ్యాత్మిక సందేశాలు, ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు… సభలను విజయవంతం చేయాలని నిర్వాహకుల పిలుపు…

పాయకాపురం, నవంబర్ 9 : విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో 14వ క్రీస్తు స్తుతి సువార్త సభలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాబాకొట్టు సెంటర్ ప్రాంతంలోని సింగ్‌నగర్ 37వ బ్లాక్‌లో గల గిద్దోను మందిరం క్రీస్తు దర్శనం సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ సభలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సభల్లో ముఖ్య ప్రసంగికులుగా రెవ. కలపాల జాషువా పాల్గొని క్రీస్తు బోధనలు, ఆధ్యాత్మిక సందేశాలను అందించనున్నారు. ముఖ్య అతిథిగా దొండపాటి ప్రభాకర్ హాజరుకానున్నారు. రెవ. మంగళపూడి జోసెఫ్ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సభల్లో ప్రారంభ ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఆత్మీయ గీతాలాపన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దైవజనులు, సంఘ పెద్దలు, సువార్త గాయకులు పాల్గొననున్నారు. భక్తులకు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన సదుపాయం కల్పించనున్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి సంగం మోజెస్ (అజయ్‌బాబు) మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సువార్త సభలను విజయవంతం చేయాలని కోరారు.

