ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడ ఉత్సవ్‌కు సువేందు అధికారికి ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందజేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు… అక్టోబరు 11 నుంచి 20 వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు… హాజరవుతానని తెలిపిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 3:23 PMకి 2,587 వీక్షణలు
విజయవాడ ఉత్సవ్‌కు సువేందు అధికారికి ఆహ్వానం — చిత్రం 1
విజయవాడ ఉత్సవ్‌కు సువేందు అధికారికి ఆహ్వానం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: విజయవాడలో అక్టోబరు 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌–2.0కు హాజరు కావాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆహ్వానించారు. సోమవారం కోల్‌కతాలోని నబన్నా సభాఘర్‌లో ఆయనను కలిసి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్లు కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటించింది. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక,

విజయవాడ ఉత్సవ్‌కు సువేందు అధికారికి ఆహ్వానం — అదనపు చిత్రం 2

కళా, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామ్మోహన్‌ నాయుడు వివరించారు. మెగా కార్నివాల్‌, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. ‘ఒక నగరం–ఒక వేడుక’ భావనతో విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో పాల్గొని విజయవాడ వైభవాన్ని వీక్షించాలని సువేందు అధికారిని కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఆయన తప్పక హాజరవుతానని తెలిపినట్లు ప్రకటనలో వెల్లడించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086