మందుల కోసం వెళ్లిన మహిళపై అఘాయిత్యం
మందులు కొనుగోలు చేసి వస్తుండగా అఘాయిత్యం... బలవంతంగా గదిలోకి తీసుకెళ్లిన యువకుడు... బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు...

వీరులపాడు మండలానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందులు కొనుగోలు చేసి వస్తున్న తనను జుజ్జూరుకు చెందిన ఓ యువకుడు బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామ రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్సై అభిమన్యు దర్యాప్తు చేపట్టారు.

