ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భవానీ దీక్షాధారులు... రాత్రంతా క్షేత్రంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో శీనా నాయక్... ఉదయం 5.10 గంటలకే 25,722 మంది భక్తులకు అమ్మవారి దర్శనం...

V10TV న్యూస్ డెస్క్ 22 అక్టోబర్, 2026 11:13 AMకి 2,710 వీక్షణలు
భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 22: ఇంద్రకీలాద్రి భవానీ నామస్మరణతో మార్మోగుతోంది. శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భవానీ దీక్షాధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రంతా క్షేత్రంలోనే ఈవో పర్యవేక్షణ భవానీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో శీనా నాయక్ బుధవారం రాత్రంతా పోలీసు అధికారులతో కలిసి క్షేత్రంలో పర్యటించారు. క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు, భక్తుల రాకపోకలను నిరంతరం పరిశీలించారు. ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 5.10 గంటలకే 25,722 మంది దర్శనం భక్తుల రద్దీ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల్లోపే అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. ఉదయం 5.10 గంటల సమయానికి 25,722 మంది భక్తులు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భవానీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల సేవలో అహర్నిశలు సిబ్బంది భవానీ దీక్షాధారులకు సజావుగా దర్శనం కల్పించేందుకు దేవస్థాన సిబ్బంది, అర్చకులు, పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ దర్శన ప్రక్రియకు ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లపై ఈవో శీనా నాయక్ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి విజయమే లక్ష్యం

6 నిమిషాల క్రితం 3,246

ట్రాఫిక్ నియంత్రణలో బెజవాడ పోలీసుల సత్తా

2 గంటల క్రితం 5,784

ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారు

2 గంటల క్రితం 3,493

భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు

2 గంటల క్రితం 2,891