ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
హెల్మెట్, చిన్‌స్ట్రాప్ తప్పనిసరిగా ధరించాలి… రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల సూచనలు… పీఎం రాహత్ పథకంపై వాహనదారులకు వివరణ…

విజయవాడ, అక్టోబరు 5: విజయవాడ బల్లెంవారి వీధిలో సోమవారం నాలుగో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించడంతోపాటు చిన్‌స్ట్రాప్‌ను తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించే పీఎం రాహత్ పథకం గురించి వివరించారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.

