ఏపీ అస్త్రం యాప్ ప్రతి ఒక్కరూ వినియోగించాలి: డీసీపీ షిరీన్ బేగం
ఆటో ప్రయాణాల్లో QR కోడ్ స్కాన్ చేసి ట్రిప్ లొకేషన్ షేర్ చేసుకోవాలని సూచన... బ్లాక్ స్పాట్ అలర్ట్స్‌తో ప్రమాద ప్రాంతాలపై ముందస్తు సమాచారం... అవగాహన వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా ఉంచి అందరికీ చేరవేయాలని పిలుపు....

విజయవాడ, ఆగస్టు 6 (వి10టీవీ):ఆటోలో ప్రయాణించే మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేయడంలో ఏపీ అస్త్రం (AP ASTraM) యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ ఆధ్వర్యంలోని ఖాకీ స్టూడియో రూపొందించిన అవగాహన వీడియోను విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆటోలో ప్రయాణించే ప్రతి మహిళ వాహనంలోని QR కోడ్‌ను స్కాన్ చేసి ట్రిప్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలని సూచించారు. దీంతో ప్రయాణం పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులు ప్రయాణాన్ని గమనించే అవకాశం ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా, బ్లాక్ స్పాట్ అలర్ట్స్ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ముందుగానే సమాచారం అందుతుందని, దీంతో మరింత అప్రమత్తంగా ప్రయాణించవచ్చని డీసీపీ వివరించారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. ముఖ్యంగా ప్రతి మహిళకు ఏపీ అస్త్రం యాప్‌లో ఉన్న భద్రతా సదుపాయాలపై అవగాహన కల్పించండి. మీ ఒక్క షేర్ కూడా ఒకరి సురక్షిత ప్రయాణానికి దోహదపడవచ్చు" అని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పిలుపునిచ్చారు. కమాండ్ అండ్ కంట్రోల్, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రజల భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.

