ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న

బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో యువత కదం తొక్కింది... నాలుగు వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ... యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 1:32 PMకి 2,574 వీక్షణలు
మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న — చిత్రం 1
మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న — చిత్రం 2
మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 28: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో ఐటీ, విద్యారంగాల అభివృద్ధికి మంత్రి నారా లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ తెలిపారు. “మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. సోమవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ కూడలి వరకు బొండా సిద్ధార్థ ఆధ్వర్యంలో “యువత భవితకు భరోసా” పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేలా పెట్టుబడులను

మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న — అదనపు చిత్రం 2
మా భవిష్యత్తు.. మా లోకేశ్ అన్న — అదనపు చిత్రం 3

ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతకు సొంత రాష్ట్రంలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పించడమే మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారిస్తుంటే వైఎస్సార్‌సీపీ రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పారదర్శకంగా జరుగుతున్న డీఎస్సీ నియామక ప్రక్రియపై బురదజల్లడం సరికాదన్నారు. రాజకీయ ఆరోపణలతో యువతను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యారంగ ప్రగతి, ఐటీ పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్‌సాయి యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు బంగారపు సతీష్, నాయకులు మణికంఠ, గాడి మురళి, ఆళ్ల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086