ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సేవా కార్యక్రమాలతో గాంధీ జయంతి

జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం… ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు… నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 4:34 PMకి 3,545 వీక్షణలు
సేవా కార్యక్రమాలతో గాంధీ జయంతి — చిత్రం 1
సేవా కార్యక్రమాలతో గాంధీ జయంతి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను సారథ్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జనసైనికులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక

సేవా కార్యక్రమాలతో గాంధీ జయంతి — అదనపు చిత్రం 2

సహాయంతోపాటు ఉపకార వేతనాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలవడమే జనసేన పార్టీ లక్ష్యమని విజయవాడ జనసేన సీనియర్‌ నాయకుడు బాడిత శంకర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086