ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్లాస్టిక్‌కు దూరంగా.. పరిశుభ్రతకు చేరువగా

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి… స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్‌ డీకే బాలాజీ… గాజు సీసాలు, ప్లేట్ల వినియోగంతో ఆచరణాత్మక సందేశం…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 5:24 PMకి 3,287 వీక్షణలు
ప్లాస్టిక్‌కు దూరంగా.. పరిశుభ్రతకు చేరువగా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, అక్టోబర్‌ 2: పరిసరాల పరిశుభ్రతతోపాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 జిల్లా స్థాయి ప్రదానోత్సవంలో కలెక్టర్‌ పాల్గొని విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని, ప్రజల్లో ప్లాస్టిక్‌ వినియోగంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్లాస్టిక్‌ సీసాలకు బదులుగా గాజు నీటి సీసాలను అందుబాటులో ఉంచారు. అల్పాహారం పంపిణీకి కూడా ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో పునర్వినియోగ ప్లేట్లను వినియోగించారు. ప్లాస్టిక్‌ రహిత వాతావరణంపై కేవలం సందేశాలు ఇవ్వడమే కాకుండా నిర్వాహకులు ఆచరణలో చూపించారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని కలెక్టర్‌ సూచించారు. ప్లాస్టిక్‌ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని, ఇది సమాజంలోని అందరి బాధ్యతని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086