అమ్మవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం
ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల పంపిణీ… నూతన అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలు… ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు…

విజయవాడ, అక్టోబర్ 18: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద భవనంలో పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఆదివారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది అన్నప్రసాదాల పంపిణీ కొనసాగించారు. అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాదం స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు భక్తులు తెలిపారు. ప్రసాదాల నాణ్యత బాగుందని, అధికారులు చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
