ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మాజీ కార్పొరేటర్ చందన సురేష్, సీనియర్ నేత గుర్రం కొండ... ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ... బుద్ధా వెంకన్న ఆదేశాలతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామన్న టీడీపీ నేతలు...

విజయవాడ, ఆగస్టు 28: పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ చందన సురేష్, టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం కొండ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో సమస్యను సావధానంగా విన్న నేతలు, వాటిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బుద్ధా వెంకన్న ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను కేవలం వినతులకే పరిమితం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోసుబాబు, గోలి శ్రీనివాసరావు, కామాక్షి తదితరులు పాల్గొన్నారు.

