రాఖీ బంధం.. మహిళల రక్షణకు ఖాకీ భరోసా
పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుకు రాఖీ కట్టిన అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత మహిళా పోలీస్ అధికారులు, విద్యార్థినుల నుంచి సీపీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు నగరంలోని ప్రతి మహిళ భద్రతకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీపీ

విజయవాడ, ఆగస్టు 28: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోదరభావం వెల్లివిరిసింది. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్మిన్ డీసీపీతో పాటు కమిషనరేట్ పరిధిలోని పలువురు మహిళా పోలీస్ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థినులు సీపీకి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది సోదరభావానికి, ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. నగరంలోని మహిళల భద్రత, రక్షణకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.
తనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళా అధికారులు, సిబ్బంది, విద్యార్థినులకు సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

