వేటకు బ్రేక్.. మత్స్యకారులకు 50 కిలోల బియ్యం
ఐదు రోజులుగా సముద్ర వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఊరట రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరద ప్రవాహాలు రిజర్వాయర్ల పరిస్థితిపై అధికారులతో చర్చ

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ఐదు రోజులుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సాయం అందించాలని సూచించారు. 10TV Telugu రాష్ట్రంలోని వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి శనివారం ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నదుల్లో వరద ప్రవాహాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిని సమీక్షించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గినట్లు అధికారులు వివరించారు. కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు తెలిపారు. 10TV Telugu కృష్ణా నదికి ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. స్థానిక వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్ ఎగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

