ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అవినీతి శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలి

మద్యం వ్యాపారులు, భూకబ్జాకోరుల రాజకీయ ప్రవేశంపై అప్రమత్తంగా ఉండాలి… నేతలు బాగుపడ్డారు తప్ప విజయవాడ అభివృద్ధి చెందలేదు: సీహెచ్‌ బాబూరావు… రెండోరోజు కండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాల్లో సీపీఎం ప్రజాపోరు యాత్ర…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 5:04 PMకి 4,962 వీక్షణలు
అవినీతి శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి నేతల అండతో పోటీకి సిద్ధమవుతున్న మద్యం వ్యాపారులు, అవినీతి బ్రోకర్లు, భూకబ్జాకోరులను ప్రజలు ఓ కంట కనిపెట్టి, ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు పిలుపునిచ్చారు. పాలక నేతలు బాగుపడ్డారు తప్ప విజయవాడ నగరం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. సీపీఎం సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్ర రెండోరోజు కండ్రిక కాలనీ, ప్రజాశక్తినగర్‌, రాధానగర్‌, రాజీవ్‌నగర్‌, వాంబే కాలనీ ప్రాంతాల్లో సాగింది. స్థానికులతో మాట్లాడిన నేతలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ లేని పార్కులు, అధ్వాన పారిశుధ్యం, స్తంభించిన డ్రైనేజీ వ్యవస్థ, దెబ్బతిన్న ఇళ్ల స్లాబులను పరిశీలించారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్‌ బిల్లులు, మంచినీటి సరఫరాలో ఆటంకాలు, అందని పట్టాలు, నిలిచిపోయిన గృహ నిర్మాణ బిల్లులు, రేషన్‌ దుకాణాల్లో సరుకుల కొరత, మహిళలకు నెలకు రూ.1,500 హామీ అమలుకాకపోవడం వంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు బాబూరావు తెలిపారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణంపై ప్రభుత్వం కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బుడమేరు వరదల సమయంలో సీపీఎం 15 కేంద్రాల ద్వారా పది రోజులపాటు 1.80 లక్షల మందికి భోజనాలు అందించి బాధితులకు అండగా నిలిచిందన్నారు. ముంపు బాధితుల్లో అనేక మందికి ఇప్పటికీ పూర్తిస్థాయి సాయం అందలేదని ఆరోపించారు. నగరాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సీపీఎం ఉద్యమాలకు అండగా నిలవాలని కోరారు. యాత్రలో సీపీఎం నాయకులు బి. రమణరావు, కె. దుర్గారావు, టి. ప్రవీణ్‌, కె. సరోజ, సీహెచ్‌ శ్రీనివాస్‌, ఝాన్సీ, పీర్‌సాహెబ్‌, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086