గాంధీ, శాస్త్రి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: వైఎస్ జగన్
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు… దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత… తాడేపల్లి నివాసంలో జయంతి కార్యక్రమం…

తాడేపల్లి, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, దేశ నిర్మాణంలో లాల్ బహదూర్ శాస్త్రి పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా జగన్ స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్‌రెడ్డి, వంగవీటి నరేంద్ర, అంకంరెడ్డి నాగనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
